Saturday, August 2, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఆగని ట్రంప్‌ సుంకాలు

ఆగని ట్రంప్‌ సుంకాలు

- Advertisement -

గరిష్టంగా 41 శాతం వరకు టారిఫ్‌లు
వాషింగ్టన్‌ :
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ 69 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై కొత్త సుంకాలను ప్రకటిం చారు. ఆయా దేశాలపై 10 శాతం నుంచి 41 శాతం వరకు సుంకాలను అమలు చేయనున్నట్టు ఆగస్టు 1న వెల్లడించారు. ఇందులో కెనడాపై 35 శాతం, బ్రెజిల్‌పై 50 శాతం, భారత్‌పై 25 శాతం, తైవాన్‌పై 20 శాతం, స్విట్జర్లాండ్‌పై 39 శాతం సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సుంకాలు ఆగస్టు 7 నుంచి అమలులోకి వస్తాయి. జాబితాలో లేని ఇతర దేశాల వస్తువులపై 10 శాతం సుంకం విధించబడుతుంది. కెనడాపై ఫెంటానిల్‌ సంబంధిత సుంకాలను 25 శాతం నుంచి 35శాతానికి పెంచుతూ ప్రత్యేక ఆర్డర్‌ జారీ చేశారు. కెనడా ఫెంటానిల్‌ ప్రవాహాన్ని అరికట్టడంలో సహకరించలేదని ట్రంప్‌ ఆరోపించారు. మెక్సికో ఉక్కు, అల్యూమినియం, రాగిపై 50 శాతం, వాహనాలపై 25 శాతం చొప్పున సుంకాలు కొనసాగుతాయని యుఎస్‌ తెలిపింది. మరిన్ని వాణిజ్య ఒప్పందాలు ప్రకటనకు సిద్ధంగా ఉన్నాయని, మెక్సికోతో పోలిస్తే కెనడా అధికారులు సహకార ధోరణిని చూపలేదని ట్రంప్‌ పేర్కొన్నారు. ”పలు దేశాలు తమతో వాణిజ్య సంబంధాలలో అసమతుల్యతను పరిష్కరించడంలో లేదా ఆర్థిక, జాతీయ భద్రతా విషయాల్లో అమెరికాతో సమన్వయం చేయడంలో విఫలమయ్యాయి” అని ట్రంప్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -