Friday, October 31, 2025
E-PAPER
Homeసినిమా'నిజం నేనే.. ఇజం నేనే'

‘నిజం నేనే.. ఇజం నేనే’

- Advertisement -

దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్న బైలింగ్వల్‌ పీరియాడికల్‌ డ్రామా ‘కాంత’ నవంబర్‌ 14న రిలీజ్‌ కానుంది. 1950ల్లోని మద్రాస్‌, సినిమా గోల్డెన్‌ ఏజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన ప్రేమకథతో పాటు మూవీ వరల్డ్‌కి ఈ సినిమా ఒక ట్రిబ్యూట్‌ అని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ చిత్రాన్ని దుల్కర్‌ సల్మాన్‌ వేఫేరర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి సంయుక్తగా నిర్మిస్తున్నారు. టీజర్‌, సాంగ్స్‌తో ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేసిన తర్వాత, మేకర్స్‌ ఇప్పుడు రాప్‌ ఆంథమ్‌ ‘రేజ్‌ ఆఫ్‌ కాంత’ని రిలీజ్‌ చేశారు. ‘నిజం నేనే.. ఇజం నేనే’ అంటూ ఝాను చాంతర్‌ స్వరపరిచిన ఈ సాంగ్‌ అందర్నీ అలరిస్తోంది.

వింటేజ్‌ ఎలిమెంట్స్‌ను ఆధునిక రాప్‌ బీట్స్‌, పవర్‌ఫుల్‌ గిటార్‌ సౌండ్స్‌తో మేళవిస్తూ రూపొందించిన ఈ ట్రాక్‌ ”కాంత” సినిమా నుండి ఎలాంటి ఎనర్జీ, ఇంటెన్సిటీని ఆశించవచ్చో చెప్పేస్తోంది.
దుల్కర్‌ సల్మాన్‌, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్‌ సల్మాన్‌, ప్రశాంత్‌ పొట్లూరి, జోమ్‌ వర్గీస్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ – సాయికృష్ణ గద్వాల్‌, సుజయ్ జేమ్స్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌ – శ్రవణ్‌ పాలపర్తి, డీఓపి – డాని శాంచెజ్‌ లోపెజ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ – తా.రామలింగం, అదనపు స్క్రీన్‌ ప్లే – తమిళ్‌ ప్రభ, సంగీతం – ఝను చంతర్‌, ఎడిటర్‌ – లెవెల్లిన్‌ ఆంథోనీ గోన్సాల్వేస్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -