నవతెలంగాణ కంఠేశ్వర్
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యుటిఎఫ్ ) 13వ ఆవిర్భావం సందర్బంగా సోమవారం జిల్లా కేంద్రంలో టీఎస్ యుటిఎఫ్ పతాకాన్ని రాష్ట్ర కార్యదర్శి డి. సత్యానంద్ ఆవిషరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో1974 లో ఏపీ యుటిఎఫ్ ఏర్పడిందని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఎస్ యుటిఎఫ్ గా ఆవిర్భావం చెందిందని అన్నారు. అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ మరియు హక్కులు, బాధ్యతలు రెండు నేత్రాలు అనే ఆశయాలతో పనిచేస్తూ ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు, అన్ని మేనేజ్మెంట్ల ఉపాధ్యాయుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.
భవిష్యత్ కాలంలో కూడా సంఘ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి శాయశక్తులా కృషి చేస్తామని, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జి. గంగాధర్, ట్రెజరర్ ఎన్.రాజారామ్, జిల్లా కార్యదర్శులు వి. సాయన్న, జి. ఆనందం, ఈ. శ్రీనివాస్, సొన్ పేట్ గంగాధర్, జిల్లా కమిటీ సభ్యులు టి.లింగన్న, ఎమ్.బాజన్న, టి.కపిల్ దేవ్, సీనియర్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ లు పాల్గొన్నారు.



