కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ దరఖాస్తులపై సంతకాలు
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
గత శాసనసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారం తులం బంగారం పథకాన్ని వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం వేల్పూర్ మండల కేంద్రంలోని తన స్వగృహంలో వివాహాలు జరిగి కొత్తగా మంజూరు కావాల్సిన కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ దరఖాస్తులపై మంజూరు చేస్తూ సంతకాలు చేశారు. ఇందులో భాగంగా భీంగల్(136), మెండోరా(46), కమ్మర్ పల్లి(35), మోర్తాడ్ (27)మండలాలకు చెందిన మొత్తం 244 కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ దరఖాస్తులపై మంజూరు చేస్తూ ఆయన సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారం తులం బంగారం పథకాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్ తో పాటు తులం బంగారం ఇవ్వాలన్నారు.కొత్తగా చెక్ లు మంజూరయ్యే లబ్దిదారులతో పాటు ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్ లు అందుకున్న వారందరికీ తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ దరఖాస్తులు ఎన్ని ఉంటే అన్ని, తను నియోజకవర్గం వచ్చినప్పుడల్లా తీసుకొచ్చి సంతకాలు చేయించుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
తులం బంగారం పథకాన్ని వెంటనే ప్రారంభించాలి: ఎమ్మెల్యే వేముల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES