Sunday, October 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ లెజిస్లేచర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా తులసీిరాజ్‌ గోకుల్‌ నియామకం

తెలంగాణ లెజిస్లేచర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా తులసీిరాజ్‌ గోకుల్‌ నియామకం

- Advertisement -

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ లెజిస్లేచర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా హైకోర్టు ప్రముఖ న్యాయవాది తులసిరాజ్‌ గోకుల్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. శనివారం హైదరాబాద్‌లోని అసెంబ్లీలోని స్పీకర్‌ చాంబర్‌లో ఆయన బాధ్యతలను స్వీకరించారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఆయన నిజాం కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. పడాల రామిరెడ్డి లా కాలేజీలో న్యాయవిద్యను అభ్యసించారు. 30 ఏండ్లుగా తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో ఆయన ప్రాక్టీస్‌ చేస్తున్నారు. రాజ్యాంగ బద్దమైన, శాసన వ్యవహారాల్లో ఆయన నిష్ణాతుడుగా గుర్తింపు పొందారు. లెజిస్లచర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ బాధ్యతలు స్వీరించిన తర్వాత ఆయన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈసందర్భంగా తులసి రాజ్‌ గోకుల్‌ను వారు అభినందించారు. అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వి. నరసింహాచార్యులు మాట్లాడుతూ తులసీరాజ్‌ గోకుల్‌ న్యాయవృత్తి అనుభవం, సలహాలు లెజిస్లేటివ్‌ పాలనా వ్యవహారాల్లో ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -