- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కర్ణాటక హోస్పేటలోని తుంగభద్ర జలాశయం మరోసారి ప్రమాదపుటంచున నిలిచింది. గతేడాది వరదలతో 19వ గేటు కొట్టుకుపోగా, స్టాప్‌లాగ్‌లను ఏర్పాటు చేసి తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. తాజాగా జలాశయంలోని మొత్తం 33 గేట్లలో ఏడు గేట్లు (4,11,18,20,24,27,28) పనిచేయడం లేదని అధికారులు గుర్తించారు. భారీ వర్షాల నేపథ్యంలో డ్యామ్ భద్రతపై ఆందోళన నెలకొంది. ప్రస్తుతం 23 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, 3 గేట్లు ఎత్తి 9 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
- Advertisement -