నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా టీవీ ఏసి జెఎసి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ తలపెట్టిన నిరవధిక సమ్మె పోస్టర్ను నిజామాబాద్ జిల్లా లో టీవీఎసి జేఏసీ జిల్లా చైర్మన్ సుజాయత్ అలీ ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 20,000 మంది ఆర్టిజన్ కార్మికులను వారి యొక్క విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ చేయాలని ఒకే సంస్థలో ఒకే రూల్ అమలు పరచాలనీ టీవీ ఏసి జెఎసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మెకు ప్రతి ఆర్టిజన్ వారి కుటుంబాలతో అధిక సంఖ్యలో పాల్గొని మన యొక్క హక్కులని సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి టీవీ ఏసి జేఏసీ కన్వీనర్ బట్టు గంగాధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లూరి నరేష్, ట్ట్రెజరర్ పాకాల మహేష్, కో కన్వీనర్ రాములు, డిచ్పల్లి డివిజన్ చైర్మన్ కన్వీనర్ రవీందర్, రాంప్రసాద్ జిల్లా నాయకులు జాదవ్ మురళి కుమార్, సాయిబాబా, ప్రసాద్, రాజు, రాము, వేణుగోపాల్, శివ, సాయిబాబా, మోహన్ ,శ్రీనివాస్, శశి, మనోహర్, తదితర నాయకులు కార్మికులు పాల్గొన్నారు.
నిరవధిక సమ్మె పోస్టర్ ను ఆవిష్కరించిన టీవీ ఏసిజెఎసి నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES