నవ తెలంగాణ – హైదరాబాద్
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టివిఎస్ మోటార్ భారత మార్కెట్లోకి తన కొత్త టివిఎస్ ఎన్‌టార్క్ 150 మోడల్‌ను విడుదల చేసింది. సోమవారం ఈ స్కూటర్‌ను టివిఎస్ గ్రూపు బ్రాండ్ మేనేజర్ రాజ్ బిస్వాస్, ఎపి, టిజి సేల్స్ జనరల్ మేనేజర్ కెండ్రజ్ జోషి, టిజి ఏరియా మేనేజర్ విశాల్ విక్రమ్ సింగ్ ఆవిష్కరించారు. ఈ స్కూటర్ కేవలం 6.3 సెకన్లలోనే 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనుందని వారు తెలిపారు. ఎబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్‌తో మెరుగైన భద్రత, నియంత్రణను కలిగి ఉంటుందని, సిగేచర్ మల్టీ పాయింట్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్రంట్ కాంబినేషన్ ల్యాంప్‌లు, కనెక్టెడ్ ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చామన్నారు. దీని ఎక్స్‌షోరూం ధరను రూ.1,19,000గా నిర్ణయించామని చెప్పారు. అయితే ఎంత మైలేజీ ఇచ్చేది ఆ కంపెనీ ప్రతినిధులు వెల్లడించలేదు.
టివిఎస్ నుంచి కొత్త ఎన్‌టార్క్ 150 విడుదల
- Advertisement -
- Advertisement -