Thursday, February 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండాక్టర్‌ అజయ్ కుమార్‌కు టీవీవీపీ జేఏసీ శుభాకాంక్షలు

డాక్టర్‌ అజయ్ కుమార్‌కు టీవీవీపీ జేఏసీ శుభాకాంక్షలు

- Advertisement -

నవతెలంగాణబ్యూరో – హైదరాబాద్‌
వైద్య విధాన పరిషత్‌ రద్దు చేస్తూ డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ సర్వీసెస్‌గా మారుస్తూ రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకోవడం పట్ల వైద్య విధాన పరిషత్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు జేఏసీ కోర్‌ కమిటీ మెంబర్‌ బైరపాక శ్రీనివాస్‌ నేతృత్వంలో పలువురు నాయకులు టీవీవీపీ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్ కుమార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు 317 జీవోను అమలు చేస్తూ పదోన్నతులు కల్పించాలని కోరారు. వైద్య విధాన పరిషత్‌లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే పర్మినెంట్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ జేఏసీ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వ్యవస్థాపకులు సోమ మల్లన్న, జేఏసీ చైర్మెన్‌గా టీవీవీపీ కార్యాలయంలో ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ వినయ్ కుమార్‌, వైస్‌ ప్రెసిడెంట్‌గా డాక్టర్‌ రవూఫ్‌, ప్రముఖ పాత్ర పోషించారని అభినందించారు. జేఏసీ ద్వారా అన్ని సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులు,జిల్లా ఆస్పత్రుల్లో ఉద్యోగులు ఇచ్చిన వినతిపత్రాలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ప్రభుత్వానికీ, తమకు వారధిగా ఉంటూ ఉద్యోగుల చిరకాల డిమాండ్‌ను డాక్టర్‌ అజయ్ కుమార్‌ న్యాయం చేశారని తెలిపారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -