Wednesday, February 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దేశవ్యాప్త సమ్మెకు టిడబ్ల్యూజేఎఫ్ మద్దతు: సయ్యద్ వలి

దేశవ్యాప్త సమ్మెకు టిడబ్ల్యూజేఎఫ్ మద్దతు: సయ్యద్ వలి

- Advertisement -

  నవతెలంగాణ – ఆత్మకూరు
గురువారం కేంద్రంలోని బిజెపి సర్కార్ అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం 1200 జరగనున్న దేశవ్యాప్త సమ్మెకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ( టిడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హనుమకొండ జిల్లా కమిటీ సంపుర్ణ మద్దతు ప్రకటించిందని జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యుడు సయ్యద్ వలి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.  కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.  రద్దయిన 29 చట్టాల్లో జర్నలిస్టులకు సంబంధించిన రెండు చట్టాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.  జర్నలిస్టు కనీస వేతనాలకు సంబంధించి గురుబక్స్ మతీజియా వేజ్ బోర్డు సిఫారసులను అమలు చేయకపోగా ఉన్న చట్టాన్ని కోడ్ లో మార్చి పాత్రికేయరంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. జాతీయ కార్మిక సంఘాల చేపట్టిన సార్వత్రిక సమ్మెకు మండల కేంద్రాల్లో ఉన్న జర్నలిస్టులు యూనియన్ లకు అతితంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మికులకు కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గురువారం ఉదయం ఆత్మకూర్ మండల కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమానికి జర్నలిస్టు మిత్రులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -