Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తికి గాయాలు

రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తికి గాయాలు

- Advertisement -

నవతెలంగాణ-గండీడ్
ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్‌లు ఢీకొనడంతో ఒకరు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం మండల కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మద్దూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వెంకటయ్య(65) కోస్గి నుండి పని నిమిత్తం గండీడ్ మండలానికి వస్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో కుడి కాలు విరిగి తలకు బలమైన గాయాలయ్యాయి. కాగా స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చేరుకున్న సిబ్బందివెంకటయ్యకు అంబులెన్స్ లోనే చికిత్స చేసి మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుని దగ్గర గల నగదు 4500, సెల్ ఫోను, ఈఎంటి జానమ్మ పైలట్ చాంద్ పాషా డాక్టర్ల సమక్షంలో బంధువైన చెన్నయ్య కు అందించినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -