Friday, October 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలురు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలురు మృతి

- Advertisement -

ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో ఘటన
యాచారం మండలం తమ్మలోనిగూడ గేటు వద్ద ఘటన

నవతెలంగాణ-యాచారం, కడ్తాల్‌
అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కొడుకులు.. రోడ్డు ప్రమాదంలో కండ్ల ముందే మరణించడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్‌ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు బాలురు మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తమ్మలోనిగూడ గేటు వద్ద గురువారం జరిగింది. సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కడ్తాల మండలం, ముద్విన్‌ గ్రామానికి చెందిన తల్లాటి స్వామి తన ద్విచక్ర వాహనంపై తన కుమారులు అభిరామ్‌(8), సాత్విక్‌ను ఎక్కించుకొని యాచారం వైపు వస్తున్నాడు. యాచారం బస్టాండ్‌ దగ్గర మరో కుమారుడు హార్దిక్‌(8) ఉన్నాడు. అతన్ని ఎక్కించుకుని మాల్‌ వైపు వెళ్తున్నాడు.

తమ్మలోనిగూడ గేటు దగ్గరికి రాగానే వెనకాల నుంచి నిర్లక్ష్యంగా అతివేగంతో వస్తున్న ట్రాక్టర్‌ డ్రైవర్‌ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అభిరామ్‌, హార్దిక్‌రామ్‌ల తలకు, శరీర భాగాలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. తల్లాటి స్వామి, సాత్విక్‌ రామ్‌ గాయపడ్డారు. క్షతగ్రాతులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి తరలించారు. తల్లాటి స్వామి అన్న హరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -