నలుగురికి గాయాలు..
నవతెలంగాణ -ముధోల్
మండలంలోని తరోడ గ్రామం వద్ద ఆదివారం రాత్రి రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. దీంతో రెండు కార్లలో ప్రయాణిస్తున్న నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం…. బైంసా నుండి నిజామాబాద్ వైపు వెళుతున్న కారు, నిజామాబాద్ నుండి బైంసా వైపు వెళ్తున్న కారు తరోడ బస్టాండ్ వద్ద ఢీ కొన్నాయి. అయితే ఈ ప్రమాదం లో నిజామాబాద్ జిల్లాకు చెందిన బలరాం, అనసూయ, అనురాధలకు తీవ్రంగా గాయాలయాయి. బైంసాకు చెందిన శివాజీకి కూడా గాయాలయ్యాయి. సమాచాచం అందుకున్న ముధోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తునట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఎదురెదురుగా రెండు కార్లు ఢీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES