Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలునీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి..

నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి..

- Advertisement -

ఆకాశాన్నంటిన కుటంబసభ్యుల రోదనలు
నవతెలంగాణ – అచ్చంపేట :
వ్యవసాయ పొలంలో నీటి నిల్వకు తీసుకున్న కవర్ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు, అన్నదమ్ములు మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామంలో వ్యవసాయ పొలంలో నీటి నిల్వ కోసం తీసుకున్న కవర్ గుంటలో పడి ప్రమాదవశత్తు ఇద్దరు పిల్లలు  (అన్నదమ్ములు) మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుంభం ధరణి, సుధాకర్ దంపతులకు అశ్విత్ కుమార్ (8), చేతన్ (6) తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లారు. తల్లిదండ్రులు పత్తి విత్తనాలు విత్తే పనిలో నిమగ్నమయ్యారు. ఇద్దరు అన్నదమ్ములు సమీపంలోని పొలం దగ్గర ఆడుకుంటూ ప్రమాదవశత్తూ నీటి గుంతలో పడి మృత్యువాత పడ్డారు. కొంత సమయానికి పిల్లలు కనిపించడం లేదని, చుట్టూ పక్కన వెతకగా గుంతలో పడివున్నారు. ఇద్దరు అన్నదమ్ములు ఒకే కుటుంబంలో ఒకేసారి అనుకోని దుర్గఘటనలో మృత్యువాత పడడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img