Sunday, May 4, 2025
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ షాక్ తో రెండు ఆవులు మృతి

విద్యుత్ షాక్ తో రెండు ఆవులు మృతి

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
విద్యుత్ షాక్‌కు గురై రెండు పాడిఆవులు మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని నాయినవానికుంట తండా  గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. బాధితుడు గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నాయినవాని కుంట తండాకి చెందిన రమావత్ సైదా నాయక్ పాడి ఆవులు తన పంటపొలం సమీపంలో మేస్తున్నాయి. అయితే అక్కడి పొలాల మధ్యన కరెంటు స్తంభాలు లేక విధ్యుత్ తీగెలు ఒక ఎత్తన కర్రను బాది దానికి తీగలు కట్టారు. గాలికి అవి కిందపడిపోయాయి. దీంతో పక్కనే ఆవులు మెస్తుండగా వాటికి షాక్ కొట్టి చనిపోయాయి. ఇంటికి వెళ్లి అన్నం తిని చేనుకు వచ్చేలోపే ఆవులు మృతి చెంది ఉన్నాయని బాదితుడు లబోదిబోమన్నాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని ఈ సందర్బంగా కోరాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -