Wednesday, October 1, 2025
E-PAPER
Homeఖమ్మంపామాయిల్ పరిశ్రమలకు రెండు రోజులు సెలవులు 

పామాయిల్ పరిశ్రమలకు రెండు రోజులు సెలవులు 

- Advertisement -

– ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి
నవతెలంగాణ – అశ్వారావుపేట

పరిశ్రమల సామర్ధ్యం మించి పామాయిల్ గెలలు దిగుమతి అవుతుండటంతో యంత్రాల నిర్వహణ పనుల నిమిత్తం ఆయిల్ ఫెడ్ అధికారులు పరిశ్రమలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. గత వారంలో అధిక వర్షాల కారణంగా రెండు ఫ్యాక్టరీలు కు నిరంతరాయంగా గెలలు ఎక్కువగా వస్తున్న తరుణంలో  సెప్టెంబర్ 10,11 (బుధ,గురు వారాల్లో) తేదీల్లో అప్పారావు పేట, అశ్వారావుపేట ఫ్యాక్టరీలకు సెలవు ప్రకటించినట్లు ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. కావున రైతు సోదరులు సహకరించి ఈ నెల 12 వ తేదీ శుక్రవారం నుంచి యధావిధిగా రెండు ఫ్యాక్టరీలకు గెలలు సరఫరా చేయాలని పరిశ్రమల మేనేజర్లు కళ్యాణ్ గౌడ్, నాగబాబులు విజ్ఞప్తి చేసారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -