నవతెలంగాణ -ఖమ్మం/ పెద్దకొత్తపల్లి
ఎండలు తీవ్రంగా ఉండటం వల్ల రోజువారీ కూలీకి వెళ్లే కూలీలు ఇద్దరు వడదెబ్బకు గురై సోమవారం మృతిచెందారు. ఈ ఘటనలు ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో జరిగాయి. ఖమ్మం కైకొడాయి గూడెం ప్రాంతానికి చెందిన బొల్లపు శ్రీనివాస్ రెడ్డి(47) బల్లెపల్లి ప్రాంతంలో ఉన్న ప్రయివేటు యుపీవీసీ ఇండిస్టీలో రోజువారీ కూలీ పనికి వెళ్తాడు. సోమవారం పనికి వెళ్లి సొమ్మసిల్లి పడిపోయాడు. స్థానికులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. వడదెబ్బ తగలడం వల్ల మూడ్రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున మృతిచెందినట్టు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని సీపీఐ(ఎం) ఖానాపురం హవేలీ కార్యదర్శి దొంగల తిరుపతిరావు పరామర్శించి, సానుభూతి వ్యక్తం చేశారు.
ఉపాధి కూలీ మృతి
నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని ఆదిరాలె గ్రామానికి చెందిన మోల్కలపల్లి నరసమ్మ(50) ఉపాధి హామీ పనులకు వెళ్లింది. రోజు మాదిరిగానే ఈనెల 3వ తేదీ పనికి వెళ్లింది. ఈ క్రమంలో ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురైంది. మండల కేంద్రంలోని అస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు కుటుంబీకులు తెలిపారు. ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
వడదెబ్బతో ఇద్దరు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES