Sunday, April 12, 2026
E-PAPER
Homeక్రైమ్ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరు బాలికలు మృతి

ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరు బాలికలు మృతి

- Advertisement -

నేలవంచలో విషాదం..
నవతెలంగాణ-గూడూరు

మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం మట్టేవాడ గ్రామపంచాయతీ పరిధిలోని నేలవంచ గిరిజన గ్రామంలో శనివారం విషాద ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరు బాలికలు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేలవంచ గ్రామానికి చెందిన పెనక రవి-కవిత దంపతుల కూతురు చైత్ర(11), కత్తుల అశోక్‌-జ్యోతి కూతురు శ్రీజ(11), పూణెం ప్రణతి.. ముగ్గురూ స్థానిక ట్రైబల్‌ వెల్ఫేర్‌ ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నారు. ఒక్కపూట పాఠశాల ముగిశాక సరదాగా గ్రామ సమీపంలోని ఊర చెరువులో చేపల వేటకు తోపేలా తీసుకొని వెళ్లారు. చేపలు పట్టిన అనంతరం వాటిని ముగ్గురూ పంచుకొన్నాక పూణెం ప్రణతి ఇంటికి వెళ్లిపోయింది. చైత్ర, శ్రీజ మాత్రం బురద కడుక్కుందామని సమీపంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. కాళ్లు చేతులు కడుక్కుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు ఇద్దరూ బావిలో పడి మృతిచెందారు. సాయంత్రమైనా పిల్లలు ఇంటికి రాకపోవడంతో శ్రీజ నానమ్మ సారమ్మ వెతుక్కుంటూ ఊర చెరువు సమీపంలోని బావి వద్దకు వెళ్లింది. అక్కడ బావి ఒడ్డున చాపల వేటకు తీసుకెళ్లిన తోపెలా, చేపలు కనబడ్డాయి. కానీ బాలికలు కనపడకపోవడంతో స్థానికుల సహకారంతో బావిలో వెతికి మృతదేహాలను బయటకు తీశారు. సంఘటన స్థలానికి గూడూరు ఎస్‌ఐ గిరిధర్‌రెడ్డి చేరుకుని, వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -