- Advertisement -
- – నాలుగు నెలల క్రితమే వివాహం
– రాజస్థాన్ కు చెందిన వారిగా గుర్తింపు
నవతెలంగాణ-అంబర్‌పేట: అనుమానాస్పద స్థితిలో ఇద్దరు నవ దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.అంబర్‌పేట ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఏషియా అసిన్ ఖాన్ (29), రాజస్థాన్ కు చెందిన పవన్ కుమావత్(21) ఇద్దరికీ నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. గోల్నాక లోని లక్ష్మీ నగర్ లో అద్దెకు ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వస్తున్నాయి. - ఆ కారణంగానే ఇంట్లో ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు చీర సహాయంతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అయితే భర్త మాత్రమే ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించడం, భార్య మంచం పైన పడి ఉండడం.. ఆమె శరీరం పూర్తిగా ఉబ్బిపోయి ముఖం చేతులు నల్లబడడం అనుమానాలకు తావిస్తుందని అంతా అనుకుంటున్నారు. వీరు ఆత్మహత్య చేసుకొని ఒకరోజు, రెండు రోజులు ఎన్ని రోజులు అయినది కూడా తెలియదు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బుధవారం రాత్రి సంఘటన స్థలానికి చేరుకొని ఇద్దరు శివాలయం పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.
- Advertisement -