-మృతుల్లో జండాగూడెం మాజీ సర్పంచ్
– కొత్తూరు పీఎస్ పరిధిలో ఘటన
నవతెలంగాణ-కొత్తూరు
లారీ, కారు ఢీకొనిఇద్దరు మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో జాతీయరహదారిపై బుధవారం అర్ధరాత్రి జరిగింది. మృతుల్లో జండాగూడెం మాజీ సర్పంచ్ ఉన్నారు. కొత్తూర్ ఎస్‌ఐ గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. జండాగూడెం మాజీ సర్పంచ్ చంద్రశేఖర్‌రెడ్డి (50) తన కారులో నందిగామ మండలం దేవుని మామిడిపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి (45)తో కలిసి స్వగ్రామం అయిన జండాగూడెంకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న లారీ, కారును ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
లారీ, కారు ఢీకొని ఇద్దరు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES