Thursday, May 29, 2025
Homeక్రైమ్గోదావరి నదిలో మునిగి ఇద్దరు మృతి

గోదావరి నదిలో మునిగి ఇద్దరు మృతి

- Advertisement -

నవతెలంగాణ-ముధోల్‌
నిర్మల్‌ జిల్లా బాసర మండలంలోని జ్ఞానసరస్వతి పుణ్యక్షేత్రానికి వచ్చి, గోదావరి నది పుణ్యస్నానానికి వెళ్లిన ఇద్దరు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి ప్రాణం కోల్పోయారు. బాసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర పర్భని జిల్లాలోని టాక్లి గ్రామానికి చెందిన కుల్దీప్‌ బాలా సాహెబ్‌(11), నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలం కమలాపూర్‌ గ్రామానికి చెందిన బొల్లమల్ల రాజు(40) గోదావరి నదిలో స్నానం చేస్తుండగా మునిగిపోయారు. స్నానపు ఘాట్‌ వద్ద తమ వారి మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు అక్కడ ఉన్నవారిని కలిచివేసింది. మృతదేహాలను వెలికి తీసి భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -