Tuesday, March 10, 2026
E-PAPER
Homeక్రైమ్విద్యుద్ఘాతంతో ఇద్దరు కూలీలు మృతి

విద్యుద్ఘాతంతో ఇద్దరు కూలీలు మృతి

- Advertisement -

– పొడవాటి ఇనుప స్టాండ్‌ తీసుకెళ్తుండగా ఘటన
నవతెలంగాణ-జన్నారం (దండేపల్లి)

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేథరిపేట గ్రామ సమీపంలో సోమవారం ఉదయం విద్యుత్‌షాక్‌కు గురై ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియన్‌ పెట్రోల్‌ బంక్‌ నుంచి ఎత్తైన ఇనుప స్టాండ్‌ను తీసుకెళ్లే క్రమంలో మెయిన్‌ లైన్‌ విద్యుత్‌ తీగలు స్టాండ్‌కు తగలడంతో ఇద్దరు విద్యుద్ఘాతంతో మృతిచెందారు. మృతులు మాదాపూర్‌కు చెందిన చల్ల లక్ష్మీనారాయణ(45), వెల్గనూర్‌కు చెందిన చందనగిరి నాగరాజు (40)గా గుర్తించారు. ఇరువురు స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెట్రోల్‌ బంక్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతూ మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఎస్‌ఐ తహసీనుద్దీన్‌ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -