- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు, ఒక సిఆర్‌పిఎఫ్ జవాన్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. గోమియా పోలీస్ స్టేషన్ పరిధిలో బిర్హోర్డెరా అటవీ ప్రాంతంలో ఉదయం 5.30గంటల ప్రాంతంలో భద్రతాదళాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించగా, సిఆర్‌పిఎఫ్ కోబ్రా బెటాలియన్‌కు చెందిన ఒక జవాన్ కూడా మృతిచెందినట్లు బొకారో జోన్ ఐజి తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయని అన్నారు. మావోయిస్టుల గుర్తింపు చేపట్టినట్లు వెల్లడించారు.
- Advertisement -