గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను విస్మరించింది : మంత్రి అడ్లూరి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైం ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేసినట్టు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలి పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయం లో ఆయన విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. విద్యార్థుల భవిష్య త్, ఉద్యోగుల సంక్షేమం కోసం తమ ప్రజా ప్రభు త్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖలో జూలై, ఆగష్టు వేతనాలు పెండింగ్ లో ఉన్న రూ.11.53 కోట్ల బకాయిలను విడుదల చేయటమే ఇందుకు సాక్షమన్నారు. టీజీటీడబ్ల్యూ ఆర్‌ఈఐ సొసైటీకి చెందిన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైమ్ సిబ్బందికి, సబ్జెక్ట్ అసోసియేట్స్, హెడ్ ఆఫీస్‌లో పనిచేస్తున్న సిబ్బందికి, స్వీపింగ్, శానిటే షన్, కేటరింగ్ సేవలకు సంబంధించి రెమ్యునరే షన్, సర్వీస్ ఛార్జీలు విడుదల చేశామని తెలిపారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సబ్జెక్ట్ అసోసియేట్స్, సీనియర్ ఫ్యాకల్టీ, గేమ్స్ కోచ్‌లు మొదలైన వారికి రూ.2.38 కోట్లు విడుదల చేశామన్నారు. 18 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం ప్రారంభమైందని చెప్పారు. ప్రగతి భవన్, కలెక్టరేట్ల నిర్మాణానికి నిధులు వెచ్చిం చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమ వసతి గృహాల నిర్మాణాలకు నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. విద్యార్థుల విషయంలో రాజకీయాలు చేయొద్దని హితవు పలి కారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పందేండ్లలో ఎన్న డూ సంక్షేమ హాస్టళ్లలో భోజనం చేయలేదని చెప్పా రు.స్కాలర్షిప్‌ల్లో కేంద్రం వాటా పెంచాలని కోరామని చెప్పారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం హైదరాబాద్‌లో సీఎస్‌ఆర్ నిధులతో నూతన హాస్టల్‌ను నిర్మించేందుకు కృషి చేస్తున్నామని తెలి పారు. గ్రూప్ వన్ విషయంలో బట్ట కాల్చి మీదేయ డం కాదు..ఆధారాలుంటే నిరూపించాలని బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ చేశారు. పిల్లల భవిష్యత్తు విషయం లో తప్పు చేయబోమని స్పష్టం చేశారు. షేక్ పేట, ధర్మపురిలో రూ.24 లక్షలతో మోడ్రన్ కిచెన్లను పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు.