Saturday, October 4, 2025
E-PAPER
Homeక్రైమ్చేపల వేటకు వెళ్లి ఇద్దరు దుర్మరణం..

చేపల వేటకు వెళ్లి ఇద్దరు దుర్మరణం..

- Advertisement -

తాజ్ పూర్ భువనగిరిలో విషాదఛాయలు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

చేపల వేటకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు దుర్మరణం చెందిన ఘటన భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. భువనగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాజ్ పూర్ గ్రామానికి చెందిన షేక్ జహంగీర్ (52) చేనేటి వాగులో చేపలు పట్టేందుకు తన స్నేహితుడు భువనగిరి పట్టణానికి చెందిన వెంకటేష్ (53)తో కలిసి చిన్నేటి వాగు వద్దకు వెళ్లారు. అక్కడ వల వేసి చేపలు పట్టేందుకు ప్రయత్నిస్తుండగా వల చిక్కుకుంది. దాన్ని తీసే క్రమంలో ఒక వ్యక్తి వెళ్లగా ప్రమాదవశాత్తు చెక్ డ్యాం నుంచి కింద పడిపోయాడు. అతడిని కాపాడడానికి వెళ్లిన మరో వ్యక్తి సైతం అక్కడే చిక్కుకోగా ఇద్దరు దుర్మరణం చెందడంతో తాజ్పూర్ గ్రామంలో, భువనగిరి జిల్లా కేంద్రంలో  విషాదచాయలు అలుముకున్నాయి‌. మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతున్నట్లు రూరల్ ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -