– పార్టీ బలోపేతానికి, సమాజ సంక్షేమం కై కృషి చేయాలని విజ్ఞప్తి – ఎమ్మెల్యే జారె
నవతెలంగాణ – అశ్వారావుపేట
మున్సిపాల్టీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పలువురు అధికార పార్టీలో చేరుతున్నారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో మున్నూరు కాపు సంఘం పట్టణ అధ్యక్షులు చిన్నంశెట్టి పవన్, చిన్నంశెట్టి శ్రీను లు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ఆద్వర్యంలో పార్టీలో చేరారు.
వీరికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరటం శుభ పరిణామం అని, పార్టీ లో చేరిన నాయకులు కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుంకవల్లి వీరభద్రరావు,జూపల్లి రమేష్,తుమ్మ రాంబాబు, మొగళ్ళపు చెన్నకేశవ రావు లు పాల్గొన్నారు.



