Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంబాలుడి మృతితో ఇద్దరిని చితకబాది చంపిన అల్లరిమూక

బాలుడి మృతితో ఇద్దరిని చితకబాది చంపిన అల్లరిమూక

- Advertisement -

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లా నిశ్చింతపూర్‌ ఏరియాలో టార్పాలిన్‌లో చుట్టబడిన మైనర్‌ బాలుడి మృత దేహాన్ని కనుగొనడంతో శనివారం ఉదయం ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈలోగా కొంతమంది గుంపు అక్కడ గల ఇద్దరు స్థానికులపై దాడి చేసి ఈ బాలుడి మృతికి వారే కారణమని ఆరోపిస్తూ వారిని హతమార్చిందని పోలీసులు తెలిపారు. బాలుడి ఇంటి పక్కన గల ఆ ఇద్దరి ఇండ్లలోని వస్తువులను మృతుడి కుటుంబం, ఆ అల్లరి మూక కలిసి ధ్వంసం చేశారని చెప్పారు. ఇద్దరు వ్యక్తులను తీవ్రంగా చితకబాదారు. వారిని ఆస్పత్రికి తీసుకెళ్ళగా వారు అప్పటికే చనిపోయినట్టు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆ బాలుడు కనిపించకుండా పోయాడు. శనివారం ఉదయానికి సమీపంలోని చెరువులో శవమై తేలాడని పోలీసు అధికారి తెలిపారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలను అదుపులోకి తీసుకురావడానికి అనేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులో వుందని, కాగా ఈ దాడులకు సంబంధించి ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad