Saturday, January 10, 2026
E-PAPER
Homeమానవిరోజూ రెండు ముక్కలు

రోజూ రెండు ముక్కలు

- Advertisement -

బొప్పాయి.. ఎన్నో పోషకాలతో నిండిన ఈ పండు ప్రతి సీజన్‌లో దొరుకుతుంది. దీనిని రెగ్యులర్‌గా తింటే చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి. బొప్పాయి పండు అంటే చాలా మందికి ఇష్టం. ఇందులో విటమిన్‌ సి, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరంలో మంచి మార్పులని తీసుకొస్తాయి. రోజూ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

జీర్ణ సమస్యలు..
రోజూ ఈ పండుని తీసుకోవచ్చు. ఈ పండులో బైపాన్‌ ఎంజైమ్‌ ఉంటుంది. దీని వల్ల అజీర్ణ సమస్యలు, ఊబకాయం వంటి సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా రోజూ పరగడపున 2 బొప్పాయి ముక్కలు తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

మలబద్ధకం..
శరీరంలో అనేక సమస్యలకి దీర్ఘకాలిక మంట కారణం. ఇందుకోసం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్‌ తీసుకోవాలి. అందుకే కెరోటినాయిడ్స్‌ ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు తీసుకుంటే మంచిది. బొప్పాయి రెగ్యులర్‌గా తీసుకుంటే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గుతుంది.

గుండె ఆరోగ్యం..
బొప్పాయి పండులో విటమిన్‌ సి, పొటాషియం, లైకోపీన్‌ పుష్కలంగా ఉంది. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి మంచివి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్‌ గుండె ఆరోగ్యాన్ని కాపాడి చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి హెచ్‌డిఎల్‌ కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

క్యాన్సర్‌ నివారణకు..
బొప్పాయిలో క్యాన్సర్‌ నిరోధక గుణాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్‌ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ఆడవారిలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రాకుండా చేస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -