నవతెలంగాణ – హైదరాబాద్: అస్సాం గాయకుడు జుబీన్ గార్గ్ ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. సింగపూర్ వెళ్లిన జుబీన్ అక్కడ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సీఎం హిమంత బిశ్వ శర్మ ఆదేశాల మేరకు జుబీన్ మృతిపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రమాద సమయంలో అక్కడున్న వారిపై నిఘా పెట్టారు. ఇప్పటికే జుబీన్ మేనేజర్ సిద్ధార్థశర్మ, నార్త్‌ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ చీఫ్ ఆర్గనైజర్ శ్యామ్‌కాను మహంత, జుబీన్ కజిన్ సోదరుడు సహా పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా జుబీన్ గార్గ్ ఇద్దరు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని సిట్ బృందం అరెస్ట్ చేసింది. నందీశ్వర్ బోరా, పరేష్ బైశ్యాలను రోజులుగా ప్రశ్నించిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.
జుబీన్ గార్గ్ మృతి కేసులో ఇద్దరు భద్రతా సిబ్బంది అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES