Monday, March 30, 2026
E-PAPER
Homeక్రైమ్గొర్రెల స్నానానికి చెరువులోకి దిగి.. ఇద్దరు గొర్రెల కాపరులు గల్లంతై మృతి

గొర్రెల స్నానానికి చెరువులోకి దిగి.. ఇద్దరు గొర్రెల కాపరులు గల్లంతై మృతి

- Advertisement -

– సిరిసిల్ల జిల్లా ధర్మారం గ్రామంలో విషాదం
నవతెలంగాణ- కొనరావుపేట

తమ గొర్రెలకు స్నానం చేయించేందుకు చెరువులోకి దిగిన ఇద్దరు కాపరులు మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముడికే లక్ష్మీరాజం (58), కుమ్మం మొండయ్య (50) ఇద్దరు గొర్రెల కాపరులు. వారు తమ గొర్రెలను స్నానం చేయించేందుకు సమీపంలోని చెరువులోకి తీసుకువెళ్లారు. గొర్రెలను నీటిలోకి దింపిన సమయంలో వారు లోనికి వెళ్లి గొర్రెలను బయటకు పంపే ప్రయత్నంలో అదుపుతప్పి లోతైన ప్రాంతంలోకి వెళ్లి గల్లంతయ్యారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసు సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. గల్లంతైన వారిని ఈతగాళ్లు నీటి తెప్పల సహాయంతో బయటకు తీశారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కొనరావుపేట ఎస్‌ఐ ప్రశాంత్‌ రెడ్డి కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -