Wednesday, March 4, 2026
E-PAPER
Homeక్రైమ్చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

- Advertisement -

– సూరారంలో హోలీ పండుగ వేళ విషాదం
నవతెలంగాణ – కుత్బుల్లాపూర్‌

హోలీ పండుగ వేళ మేడ్చల్‌ – మల్కాజిగిరి జిల్లా సూరారంలో తీవ్ర విషాద ఘటన జరిగింది. ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి ప్రాణం కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌ సూరారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని విశ్వకర్మ కాలనీకి చెందిన సాగర్‌(17), కృష్ణానగర్‌కు చెందిన అభిషేక్‌(17) ఇంటర్‌ చదువుతున్నారు. మంగళవారం హోలీ వేడుకల అనంతరం స్నానం కోసం స్నేహితులతో కలిసి సూరారం పంతులు చెరువులో ఈతకు వెళ్లారు. ఉత్సాహంగా నీటిలోకి దిగిన వారు చెరువులోని లోతైన ప్రాంతానికి వెళ్లడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతిచెందారు. స్నేహితులు వెంటనే సూరారం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి రెండు మృతదేహాలను వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి వరకు స్నేహితులతో కలిసి సంతోషంగా రంగులు చల్లుకుంటూ గడిపిన విద్యార్థులు ఆ తర్వాత విగతజీవులుగా మారడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సెలవు రోజుల్లో పిల్లలు చెరువులు లేదా ప్రమాదకరమైన జలాశయాల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూరారం సీఐ ఎస్‌ సుధీర్‌ కృష్ణ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -