Wednesday, October 22, 2025
E-PAPER
Homeజిల్లాలుపరీక్షలలో ఇద్దరు విద్యార్థుల డీబార్..

పరీక్షలలో ఇద్దరు విద్యార్థుల డీబార్..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి 
తెలంగాణ యూనివర్సిటీలో 11వ రోజు జరిగిన ఎం.ఏ/ ఎం కాం/ ఎం.ఎస్సీ / ఎంబీఏ/ ఎల్.ఎల్.బి /ఇంటగ్రేటెడ్ పీజీ కోర్సుల రెండవ మరియు నాల్గవ సెమిస్టర్  పరీక్షలకు ఉదయం 1534 మంది విద్యార్థులకు గాను 1431 మంది విద్యార్థులు హాజరైనారు. 101 మంది విద్యార్థులు గైరాజరుకాగా..  గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో ఇద్దరు డీబార్ అయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 24 మంది విద్యార్థులకు గాను  24 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఉదయం జరిగిన 12వ రోజు   బి.ఎడ్/ బి.పి ఎడ్  పరీక్షకు 52 మంది విద్యార్థులకు గాను 40 మంది విద్యార్థులు హాజరైనారని 12 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. రెండవ రోజు ఏం.ఎడ్ ఒకటవ, రెండవ మూడవ మరియు నాల్గవ  సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్  థియరీ పరీక్షలు బుధవారం ఉదయం జరిగిన పరీక్షలకు 29 మంది విద్యార్థులు ఉండగా 27 హాజరయ్యారు. కాగా 02 మంది విద్యార్థులు గైరాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు  ఒక విద్యార్థి గైర్హాజరవ్వగా ఒక విద్యార్థి హాజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -