Friday, October 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఇద్దరు దొంగలు అరెస్టు..

ఇద్దరు దొంగలు అరెస్టు..

- Advertisement -

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ : రైల్వే స్టేషన్లలో రాత్రి వేళలో ఒంటరి ప్రయాణికులే లక్ష్యంగా దోపిడీకి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను  నాంపల్లి రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లి ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ బి.ప్రవీణకుమార్ తెలిపిన వివరాల ప్రకారం… లింగపల్లి రైల్వే స్టేషన్ లో ఫ్లాట్ ఫాం  వద్ద ఈనెల 6న ఒంటరిగా ఉన్న ఓ వ్యక్తిని బెదిరించి దోపిడీకి పాల్పడిన మహారాష్ట్రకు చెందిన మహేక్ మోయి నుద్దీన్ షేక్(19), అజీమ్ గౌస్ షేక్(25) తప్పించుకు తిరుగుతుండగా స్టేషన్ తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదములు కనిపించడంతో  వారిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసినట్లు నిర్ధారణ కావడంతో పాటు రూ.10వేల విలువ గల సెల్ ఫోన్, రూ.300 నగదును స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీలో పాల్గొన్న కానిస్టేబుల్ లు జి.సాయికుమార్, ఎ.శ్రీనివాస్, షకీల్ పాషా లను ఆయన అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -