Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి సెకనుకు రెండు యూనిట్ల రక్తం అవసరం..

ప్రతి సెకనుకు రెండు యూనిట్ల రక్తం అవసరం..

- Advertisement -

రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం..
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు..
నవతెలంగాణ – కామారెడ్డి 

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు వైద్యశాలలో బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో జిల్లా కేంద్రంలోని సహకార బ్యాంకులో సహాయ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న ఎల్లారెడ్డి కేంద్రానికి చెందిన లింగయ్య గారి సాయి ప్రణీత్ గౌడ్ మానవత దృక్పథంతో ముందుకు వచ్చారు. ఈ క్రమంలో రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు రెండు యూనిట్ల రక్తం అవసరం ఉన్నదని ప్రతిరోజు 30 మిలియన్ల రక్తాన్ని వివిధ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి అందజేయడం జరుగుతుందని అన్నారు.

2007లో ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందజేయడం కోసం ప్రారంభించిన రక్తదాన కార్యక్రమాలు నేటికీ రాష్ట్రమంతా విస్తరించి ప్రతిరోజు ఐదు నుండి పదిమందికి సకాలంలో రక్తాన్ని అందజేయడానికి కృషి చేస్తున్నామని రక్త దాతలు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ఎలాంటి సంబంధం లేకపోయినా రక్తసంబంధంతో ప్రాణదాతలుగా నిలుస్తున్న రక్తదాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.  రక్తదానం చేసిన సాయి ప్రణీత్ కి ప్రశంస పత్రాన్ని అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షులు పర్శ వెంకటరమణ, లింగయ్య గారి మహేందర్ గౌడ్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -