Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeక్రైమ్ఆగిఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం.. వ్యక్తి మృతి

ఆగిఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం.. వ్యక్తి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హసన్ పర్తి
బైక్ పై వెళ్తున్న వ్యక్తి ఆగివున్న లారీని వెనుకనుండి ఢీకొని మృతి చెందిన ఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేయు క్రాస్ రోడ్డు సమీపంలోని మహీంద్రా షోరూమ్ ముందు జరిగింది. వివరాల్లోకి వెళితే… హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బోడిగే సదానందం(53) అనే వ్యక్తి తన మిత్రుడు ఈరా సురేందర్ తో కలిసి తన హీరో స్ప్లెండర్ ప్లస్( బైక్ నెం.ఎపి -09-ఎఎస్ -6852) పై కూరగాయలు,కిరాణా షాపు సామాగ్రిని కొనుగోలు చేయడానికి హనమకొండకు బయలుదేరాడు. వారు హనుమకొండలోని కేయు క్రాస్ రోడ్డు సమీపంలోని మహీంద్రా షోరూమ్ ముందు వద్దకు చేరుకున్నప్పుడు బోడిగే సదానందం తన బైక్ నియంత్రణ కోల్పోయి, ఎవరికీ ఎటువంటి సూచన ఇవ్వకుండా ప్రధాన రహదారిపై నిర్లక్ష్యంగా ఆపి ఉంచబడిన టిఎస్ -08-యుఎ-2688 లారీని ఢీకొట్టగా సదానందం మరణించాడు. బైక్ వెనుక కూర్చొని ప్రయాణిస్తున్న ఈరా సురేందర్ కు శరీర భాగాలపై స్వల్పంగా గాయాలయ్యాయి. నిర్లక్ష్యంగా రహదారిపై లారీని ఆపి ఉంచిన బసంత్ నగర్ కన్నక గ్రామనికి చెందిన నిందితుడు డ్రైవర్ ఎండీ సాజిద్ పాషా పై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కేయు సర్కిల్ ఇన్ స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img