Tuesday, December 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరెండేండ్ల తెలంగాణ రైజింగ్‌

రెండేండ్ల తెలంగాణ రైజింగ్‌

- Advertisement -

– సామాజిక, ఆర్థిక పురోగతికి పరుగులు
– దేశంలోనే ఆదర్శవంతమైన కార్యక్రమాలు అమలు
– దేశవిదేశాలను ఆకర్షించిన ఫ్యూచర్‌ సిటీ : సీఎంఓ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రెండేండ్ల కాంగ్రెస్‌ పాలన తెలంగాణ రైజింగ్‌ అని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. 24 నెలల ప్రజా పాలనలో తెలంగాణ సామాజికంగా, ఆర్థికంగా కొత్త అడుగులు వేసిందని తెలిపింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచే ప్రజాస్వామిక మార్పు మొదలైందని పేర్కొంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సుస్థిర పాలనతో దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలబెట్టిందని తెలిపింది. రోజుకో వినూత్న ఆలోచనతో ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన విధానాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొంది. ఆరు గ్యారంటీల హామీల అమలుతో మొదలైన ప్రయాణం నాలుగు కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ఆవిష్కరించే దిశగా పరుగులు తీసిందని ప్రకటించింది. తెలంగాణను ది ఫ్యూచర్‌ స్టేట్‌గా.. హైదరాబాద్‌ను ఫ్యూచర్‌ సిటీగా ప్రపంచానికి పరిచయం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన బృహత్తర ప్రయత్నం దేశవిదేశాలను ఆకర్షించిందని తెలిపింది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దిగ్గజ కంపెనీలు తరలిరావటం శుభ పరిణామమని పేర్కొంది.
61,379 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
దేశంలోనే వినూత్నంగా రాష్ట్రంలో విజయవంతంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన, బీసీలకు రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ ఉప కులాల వర్గీకరణ, రేషన్‌ కార్డుదారులపై సన్న బియ్యం పంపిణీ వంటి చర్యలు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు పదేండ్లుగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దిందని పేర్కొంది. న్యాయమైన నీటి వాటాల సాధనకు ప్రజా ప్రభుత్వం చేసిన పోరాటం అందరినీ ఆకర్షించిందని తెలిపింది. రికార్డు వేగంతో 61,379 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చిందని ప్రకటించింది. అప్పుల్లో చిక్కిన రాష్ట్ర ఖజానాను వడ్డీల భారం నుంచి ఉపశమనం కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుసరించిన లోన్‌ రీస్ట్రక్చరింగ్‌ ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పట్టిందని తెలిపింది. వాటితోపాటు ప్రభుత్వం ఈ రెండేండ్లలో అన్ని వర్గాలనూ ఆకట్టుకునేందుకు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను చేపట్టిందని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -