నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
హనుమకొండ జిల్లా యాదవనగర్ కెనాల్‌లో పడి ఇద్దరు యువకులు గల్లంతైన విషాదకకర ఘటన మంగళవారం జరిగింది. స్థానిక కేయూ ఎస్‌ఐ నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ముకూల్ (25), మక్తాన్ (20) అనే ఇద్దరు యువకులు మూడేండ్ల్లుగా చింతగట్టు కెనాల్ బ్రిడ్జీ సమీపంలో పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం వీరిద్దరూ తమ వద్ద ఉన్న చెత్తను పారేయడానికి యాదవనగర్ కెనాల్ వద్దకు వెళ్లారు. చెత్త పడేసిన అనంతరం చేతులు కడుక్కోవడానికి కెనాల్‌లోకి దిగగా, ఒక్కసారిగా కాలు జారి ప్రవాహంలో కొట్టుకుపోయారు. కుటుంబ సభ్యుల సమాచారంతో హనుమకొండ ఏసీపీ నరసింహారావు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించిన ఆయన, పోలీసు సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. ప్రస్తుతం కెనాల్ పరిసర ప్రాంతాల్లో గాలింపు కొనసాగుతోంది.
యాదవనగర్ కెనాల్‌లో పడి ఇద్దరు యువకులు గల్లంతు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



