నవతెలంగాణ కల్లూరు
గ్రీన్ ఫీల్డ్ హైవే మీద శుక్రవారం ఉదయం మోటార్ సైకిల్ అ జాగ్రత్తగా నడపడంతో సైడ్ రైలింగ్ కి ఢీకొని ఇద్దరు యువకులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ఈ విషయం తెలుసుకొని ఎస్ ఐ బి హరిత సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి గా వారి వద్ద లభించిన ఆధారాలతో ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కుమ్మరకుంట గ్రామపంచాయతీ శివారు కేఎస్ రామవరం గ్రామం గ్రామానికి చెందిన వారు గా గుర్తించడం జరిగింది అన్నారు. కొమ్ము సాయి(35) గట్టు రాంబాబు(32) ఇద్దరు యువకులు చింతలపూడి నుండి ఖమ్మం వైపు గ్రీన్ ఫీల్డ్ హైవే మీద మోటర్ సైకిల్ పై వెళుతుండగా కల్లూరు మండలం లింగాల గ్రామం సమీపంలో హైవేపై ఏర్పాటు చేసిన రైలింగ్ ఢీకొని తీవ్ర గాయాలతో సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. భౌతిక క యాల్ని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చరీలో భద్రపరిచినట్లు తెలిపారు. ఈమెరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.



