– ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే మెచ్చా
నవతెలంగాణ – అశ్వారావుపేట
బీఆర్ఎస్ నాయకులు కాసాని చంద్ర మోహన్ – నాగశేషపద్మ దంపతుల స్వగ్రామం మద్దికొండ లో శ్రీశ్రీ ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో,వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గం ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం పలకగా, మెచ్చా నాగేశ్వరరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని,అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాసాని చంద్రమోహన్ – నాగ శేష పద్మ దంపతులు, స్థానికులు తాటి కన్నారావు, మొడియం వెంకటేష్, ముత్యాలరావు, తాటి నాగరాజు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పార్టీ శ్రేణులు, గ్రామ పెద్దలు భక్తులు ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.



