నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. తమ బ్యాంకులో వేతన ఖాతా కలిగిన ఆర్టీసీ సిబ్బందికి సామాజిక భద్రతను మరింత పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం ప్రమాదవశాత్తూ జరిగే మరణాలకు మాత్రమే వర్తిస్తున్న బీమా సౌకర్యాన్ని, ఇప్పుడు సహజ మరణాలకు కూడా వర్తింపజేస్తున్నట్ల్టు ప్రకటించింది. యూనియన్ బ్యాంక్లో శాలరీ అకౌంట్ కలిగి ఉన్న ఉద్యోగి సహజంగా మరణించినా, వారి కుటుంబానికి రూ. 10 లక్షల ఉచిత బీమా సొమ్ము అందుతుందని తెలియజేసింది. ఈ నూతన నిబంధన ఏప్రిల్ ఒకటి 2026 నుంచి నుంచి అమల్లోకి వచ్చింది.
ఈ సౌకర్యం కోసం ఉద్యోగులు రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదనీ, ఇది పూర్తిగా బ్యాంకే భరిస్తుందని చెప్పింది. గతంలో ఉన్న రూ. కోటి ప్రమాద బీమా సౌకర్యం యథాతథంగా కొనసాగుతుందనీ, అదనంగా ఈ సహజ మరణ బీమా కూడా అమలుచేస్తామని ప్రకటించింది. టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి చేసిన ప్రత్యేక సూచనల మేరకు యూనియన్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తద్వారా సంస్థలో పనిచేస్తున్న దాదాపు 38వేల పైగా ఉద్యోగుల కుటుంబాలకు గొప్ప ఆర్థిక భరోసా లభించనుందని ఆర్టీసీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది.
ఆర్టీసీ ఉద్యోగుల సహజ మరణానికీ యూబీఐ రూ.10లక్షల బీమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



