Wednesday, July 23, 2025
E-PAPER
Homeబీజినెస్యూకో బ్యాంక్‌కు రూ.607 కోట్ల లాభాలు

యూకో బ్యాంక్‌కు రూ.607 కోట్ల లాభాలు

- Advertisement -

హైదరాబాద్‌ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో యూకో బ్యాంక్‌ నికర లాభాలు10 శాతం వృద్ధితో రూ.607 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే త్రైమాసి కంలో రూ.551 కోట్ల లాభాలు ఆర్జించింది. ఇదే సమయంలో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం రూ.2,254 కోట్లుగా ఉండగా.. గడిచిన క్యూ4లో 7 శాతం పెరిగి రూ.2,403 కోట్లకు చేరింది. బ్యాంక్‌ నికర నిరర్థక ఆస్తులు 0.50 శాతం నుంచి 0.45 శాతానికి తగ్గాయి. స్థూల నిరర్థక ఆస్తులు 3.32 శాతం నుంచి 2.63 శాతానికి పరిమితమయ్యాయి. 2025 జూన్‌ ముగింపు నాటికి దేశ వ్యాప్తంగా 3,305 శాఖలు, హాంగ్‌కాంగ్‌, సింగపూర్‌లో ఒక్కొటి చొప్పున శాఖలు, 2575 ఏటీఎం శాఖలను కలిగి ఉంది. గడిచిన త్రైమాసికంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం 13.51 శాతం పెరిగి రూ.5,23,736 కోట్లుగా చోటు చేసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -