Friday, December 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఉదయ్ భాస్కర్‌ 'సెకండ్‌ ఇన్నింగ్స్‌'

ఉదయ్ భాస్కర్‌ ‘సెకండ్‌ ఇన్నింగ్స్‌’

- Advertisement -

సహజ నటనకు, భావోద్వేగ ప్రదర్శనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఉదయ్ భాస్కర్‌. ఆయన మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఉదయ్ భాస్కర్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సెకండ్‌ ఇన్నింగ్స్‌’ షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. సుమారు పదహారు సంవత్సరాల నటనా అనుభవం కలిగిన ఉదయ్ భాస్కర్‌ పాత్రలోకి పూర్తిగా లీనమయ్యే నటుడిగా పరిశ్రమలో గుర్తింపు పొందారు. రంగస్థలం నుంచి ప్రారంభమైన ఆయన ప్రయాణం టెలివిజన్‌, సినిమాల వరకు విస్తరించి, ప్రతి దశలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంది.

సహజమైన హావభావాలు, కళ్లతోనే భావాలను పలికించే నటన ఆయన ప్రధాన బలం. ఉదయ్ భాస్కర్‌ నటనలో అతి ఆరాటం ఉండదు. పాత్ర అవసరమైతే మౌనంతోనే ప్రేక్షకుడిని కట్టిపడేసే శైలి ఆయనది. అదే కారణంగా ఆయన చేసిన పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో ఎక్కువకాలం నిలిచిపోతాయి. ప్రతి పాత్రను గౌరవంతో, బాధ్యతతో స్వీకరించి, దానికి పూర్తి న్యాయం చేయాలనే తపన ఆయన నటనలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో సహనటిగా నక్షత్రతో ఆయన నటించిన సన్నివేశాలు సహజంగా, నిజాయితీగా వచ్చాయని, ఇద్దరి మధ్య కనిపించే భావోద్వేగ అనుసంధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ చిత్రంపై ముఖ్యంగా ఉదయ్ భాస్కర్‌ నటనపై పరిశ్రమలో ఆసక్తి పెరగడం విశేషం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -