Wednesday, March 11, 2026
E-PAPER
Homeకరీంనగర్ఈనెల 17న ఉగాది కవి సమ్మేళనం..

ఈనెల 17న ఉగాది కవి సమ్మేళనం..

- Advertisement -

నవతెలంగాణ- రాజన్న సిరిసిల్ల
పరాభవనామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం ఈనెల 17 న గాంధీనగర్ హనుమాన్ మందిరంలో సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో జరుగుతుందని సిరిసిల్ల సాహితీ సమితి గౌరవ అధ్యక్షులు పోరండ్ల మురళిధర్ పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా కవులకు, రచయితలకు ఉగాది పురస్కారంతోపాటు సన్మానం చేయబడుతుందని ఆయన పేర్కొన్నారు. ఉగాది కవి సమ్మేళనానికి అందరూ హాజరు అయి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి , డి.ఎస్.పి నాగేంద్ర చారి, మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులుపి చింతోజు భాస్కర్ హాజరవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో రచయితలు నేరోజీ రమేష్, వెంగళ లక్ష్మణ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -