Saturday, July 26, 2025
E-PAPER
Homeఖమ్మంఊకే వీరాస్వామి మృతి సీపీఐ(ఎం)కు తీరని లోటు

ఊకే వీరాస్వామి మృతి సీపీఐ(ఎం)కు తీరని లోటు

- Advertisement -

కమ్యూనిస్ట్ ఉద్యమ వారసత్వం…
చివరి శ్వాస వరకు పార్టీ ఎర్రజెండా తోనే… 
అంతిమ యాత్రలో పాల్గొన్న జిల్లా కార్యవర్గం….
జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు..
నవతెలంగాణ – అశ్వారావుపేట

తన తండ్రి ఊకే రామయ్య కమ్యూనిస్ట్ ఉద్యమ వారసత్వంగా తన చివరి శ్వాస వరకు ఎర్రజెండా నే నమ్మిన ఊకే వీరాస్వామి మృతి సీపీఐ(ఎం) కు ఈ ప్రాంతంలో తీరని లోటని పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు ఆయనకు జోహార్ లు అర్పించారు.

సీనియర్ పార్టీ నాయకులు,రెండు దఫాలు నందిపాడు పంచాయితీ సర్పంచ్ గా సేవలు అందించిన ఊకే వీరాస్వామి (84) వయోభారంతో కూడిన అనారోగ్యంతో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు.వీరా స్వామికి భార్య బుల్లెమ్మ,ఇరువురు కుమారులు,ఒక కుమార్తె ఉన్నారు.

స్థానిక మండల కార్యదర్శి సోడెం ప్రసాద్ ద్వారా వీరాస్వామి మరణ వార్త తెలుసుకున్న జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు,రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరం కనకయ్య,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లయ్య లు నందిపాడు చేరుకుని వీరాస్వామి భౌతిక కాయం పై పార్టీ పతాకాన్ని ఉంచి నివాళులు అర్పించారు. ఆయన మృతికి జిల్లా కమిటీ తరుపున సంతాపం ప్రకటించారు.కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి వారిని ఓదార్చారు.

ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు అర్జున్ అద్యక్షతన ఏర్పాటు చేసిన ఆయన సంతాప సభలో మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వం నుండే ఈ ప్రాంతంలో వామపక్ష భావజాలాన్ని ప్రేరేపించిన ఊకే రామయ్య నైజాం సైన్యాలకు ఎదురొడ్డి పోరాడిన వ్యక్తిగా ఈ ప్రాంతంలో గిరిజనులకు అండగా ఉండి,వారి హక్కులు సాధనకు కృషి చేసాడని,అదే తండ్రి పోరాట బాటలోనే తన తనయులు వీరాస్వామి,వెంకటేశ్వరరావు లు పార్టీ విస్తరణకు కృషి చేసారని అన్నారు.

రాష్ట్ర కమిటీ సభ్యులు కనకయ్య మాట్లాడుతూ పోడు భూములకు రక్షణగా అనేక పోరాటాలు,ఉద్యమాలు కు మార్గదర్శి గా వీరస్వామి నిలిచారని,పలు బూర్జువా పార్టీలు ప్రలోభాలకు గురి చేసి పార్టీ మారాలని వత్తిడి చేసినా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి చివరి శ్వాస వరకు ఎర్రజెండా నే నమ్ముకున్న వీరాస్వామి నికార్షైన మర్క్సిస్ట్ గా కీర్తి పొందారని అన్నారు.

జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పుల్లయ్య మాట్లాడుతూ ఊకే రామయ్య ఒక దఫా,వీరాస్వామి రెండు దఫాలు,వీరాస్వామి భార్య బుల్లెమ్మ ఒక దఫా నందిపాడు సర్పంచ్ పని చేసినా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నీతి నిజాయితీలతో పంచాయితీ పాలన చేసారని వారి సేవలను కొనియాడారు.

అనంతరం వీరితో పాటు వీరాస్వామి అంతిమ యాత్రలో జిల్లా కార్యదర్శి వర్గం సభ్యులు అన్నవరం సత్యనారాయణ,రేపాకుల శ్రీనివాసరావు,మండల కార్యదర్శి వర్గ సభ్యులు ముల్లగిరి గంగరాజు,కారం సూరిబాబు,మడిపల్లి వెంకటేశ్వరరావు,మండల కమిటీ సభ్యులు కలపాల భద్రం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -