Thursday, January 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంర‌ష్యాకు వెళ్ల‌నున్న ఉక్రెయిన్ అధ్య‌క్షుడు

ర‌ష్యాకు వెళ్ల‌నున్న ఉక్రెయిన్ అధ్య‌క్షుడు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మాస్కోలో రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం ముగించేందుకు శాంతి చర్చలు జరగనున్నాయి. త్వరలో జరగనున్న ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌, వ్లాదిమర్‌ జెలెన్‌స్కీలు సమావేశం కానున్నారు. శాంతి చర్చల సమావేశానికి జెలెన్‌స్కీ సిద్ధంగా ఉన్నారు. మాస్కోకి రానున్న ఆయనకు స్వాగతం పకలడానికి మేము సంతోషంగా ఉన్నాం అని రష్యా అధ్యక్ష సలహాదారు యూరి ఉషాకోవ్‌ మీడియాకు వెల్లడించారు. ఇటీవల యుఎఇలో జరిగిన శాంతి చర్చల్లో రష్యా, ఉక్రెయిన్‌, అమెరికాలు పాల్గొన్నాయి.

కాగా, రష్యాలో శాంతి చర్చలు జరిపేందుకు జెలెన్‌స్కీ సిద్ధంగా లేరు. అందుకే యుఎఇలో శాంతి చర్చలకు అమెరికా చొరవ చూపింది. అయినా సఫలం కాలేదు. రెండు దేశాల మధ్య యుద్దం జరుగుతూనే ఉంది. ఆ తర్వాత త్వరలో మాస్కోలో చర్చలు జరగనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -