Sunday, March 29, 2026
E-PAPER
Homeఆదిలాబాద్మహిళా సంఘ సభ్యులకు ఉల్లాస్ పరీక్ష 

మహిళా సంఘ సభ్యులకు ఉల్లాస్ పరీక్ష 

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండలంలోని ఆయా గ్రామంలో ఉన్న డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు అక్షరస్యత పై ప్రభుత్వం ఆదివారం ఉల్లాస్ పరీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా మండలంలో ఉన్న ఆయా గ్రామాల మహిళలు 1944మంది మహిళలు పరీక్షలకు హాజరైనాట్లు పరీక్షల నిర్వహణ అధికారి మండల విద్య అధికారి విజయ్ కుమార్ తెలిపారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న డ్వాక్రా గ్రూపులో పని చేస్తున్న మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండేందుకే ప్రభుత్వం ఉల్లాస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి గ్రామల్లో ఉన్న నిరక్ష్య రాసులకు పరీక్షలు నిర్వహించి ఇందులో పాస్ అయినా మహిళలు సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ కందురు సాయినాథ్, మార్కెట్ కమిటీ చెర్మన్ కళ్యాణ్ ఆత్మ కమిటీ చెర్మన్ వివేకానంద ఐకేపి ఎపిఎం దత్తాత్రి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్ సీసీ లు భూమన్న, విఠల్, గంగాధర్, పరశురాం సిఆర్పీ ఆనంద్ మహిళా సంఘాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -