Friday, February 20, 2026
E-PAPER
Homeజిల్లాలునిజామాబాద్ మేయర్ గా ఉమారాణి భాద్యతలు స్వీకరణ

నిజామాబాద్ మేయర్ గా ఉమారాణి భాద్యతలు స్వీకరణ

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
రాష్ట్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో, ఉప ఎన్నికలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారని, ప్రతి మున్సిపాలిటీలను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నిజామాబాద్ మేయర్ గా ఉమారాణి శుక్రవారం నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, ముఖ్య నాయకులు హాజరయ్యారు. కూరగాయల ఉమారాణి మేయర్గా బాధ్యతలు స్వీకరించారు.

డిప్యూటీ మేయర్ సల్మా తహసీన్ కూడా బాధ్యతలు స్వీకరించింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. మన ముందు జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ప్రజల ఆలోచన మేరకు కాంగ్రెస్ పాలన కొనసాగుతుందన్నారు. 2014లో తెలంగాణ ప్రత్యేక బిల్లు పాసైంది ఇదే రోజన్నారు. ఇప్పటికీ 12 ఏళ్లు అయిందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంపై వివక్ష చూపిస్తోందన్నారు.తెలంగాణ ఉద్యమకారులకు కచ్చితంగా న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. 250 గజాల స్థలానికి సంబంధించి త్వరలోనే కమిటీ వేసి తగు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవడం తమ బాధ్యత అని చెప్పారు.

అదేవిధంగా టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..ఎన్నికల వరకే రాజకీయాలని, తర్వాత అభివృద్ధి తమ లక్ష్యమని తెలిపారు. నగరంలోని అన్ని డివిజన్లకు సమన్యాయం చేయాలని మేయర్కు సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్పై ప్రత్యేక దృష్టి సారించారని అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కూడా ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు. 60 డివిజన్లో డిప్యూటీ మేయర్ తో కలిసి కార్పొరేటర్లతో కలుపుకొని సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా కృషి చేయాలని, మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిశీలిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందుకు సాగాలని తెలిపారు. 

ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జిల్లాకు చెందిన టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో మున్సిపల్ కార్పొరేషన్లను మోడల్ కార్పొరేషన్లు గా తీర్చిదిద్దేలకు ముందుకు సాగుతున్నామన్నారు. నిజామాబాద్ అభివృద్ధి చేయంగా అన్ని రకాల నిధులు నిజామాబాద్ కు వచ్చేలా కృషి చేస్తూ అభివృద్ధికి తోడ్పడుతున్నామన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి  చెందేందుకు ఎందుకు కట్టుబడి ఉన్నామని, టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో నిజామాబాదును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, కాంగ్రెస్  పార్టీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొని మేయర్ కు, డిప్యూటీ మేయర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -