– మహబూబ్‌నగర్ జిల్లా పెద్దదార్పల్లి గ్రామంలో ఘటన
నవతెలంగాణ -హన్వాడ
కుమారుని మృతిని తట్టుకోలేని తల్లి హఠాన్మరణం చెందిన విషాదకర ఘటన మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్దదార్పల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం గ్రామంలో దెబ్బడి కృష్ణయ్య (40) కూలి పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. అనారోగ్య కారణంగా మానసిక వేదనకు గురై కృష్ణయ్య ఇంట్లోనే చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించే సరికే మృతి చెందాడు. కొడుకు మరణం తట్టుకోలేక తల్లి దెబ్బడి బాలమ్మ (80)గుండెపోటుకు గురయింది. కుటుంబసభ్యులు ఆమెను వెంటనే మహబూబ్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్థారించారు. ఒకేరోజు తల్లీకొడుకు మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య లక్ష్మి, కుమారుడు చంటి, కూతురు స్వేచ్ఛ ఉన్నారు. మృతునిది పేద కుటుంబం కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
కుమారుని మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



