- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
ఉన్నత చదివినా జీవానోపాధి దోరకకపోవడంతో..జీవితంపై విరక్తి చెందిన యువకుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడాడు. ఈ ఘటన మండల కేంద్రానికి అనుబంధ గ్రామమైన ఎల్లంపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగెం రాజేందర్(25) ఉన్నత చదువు చదివి కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
గురువారం ఇంటి నుండి వెళ్లి తిరిగిరాకపోవడంతో ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. మండల కేంద్రంలోని శ్మశానవాటిక ఆవరణం వద్ద చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలిపారు. మృతుని తల్లి పిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టామని ఏఎస్ఐ శంకర్ రావు తెలిపారు.
- Advertisement -