Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వేలంపాట ద్వారా ఏకగ్రీవాలు చేయరాదు

వేలంపాట ద్వారా ఏకగ్రీవాలు చేయరాదు

- Advertisement -

– నామినేషన్ వేయకుండా ఎవరిని భయపెట్టొద్దు
– ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీలు గాని, మరెవరైనా గాని వేలంపాట ద్వారా ఏకగ్రీవాలు చేయరాదని,  నామినేషన్ వేయకుండా ఎవరిని భయపెట్టొద్దని ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండలంలోని అమీర్ నగర్, దొమ్మరిచౌడ్ తండా, కొత్త చెరువు తండా, కోన సముందర్ గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గ్రామస్తులతో ఎన్నికలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, తహసిల్దార్ గుడిమేల ప్రసాద్, ఏఎస్ఐ మండల పంచాయతీ అధికారి సదాశివ్ గ్రామస్తులకు ఏకగ్రీవ ఎన్నికల గురించి అవగాహన కల్పించారు.

గ్రామ అభివృద్ధి కమిటీలు, ఎవరైనా గానీ వేలం ద్వారా సర్పంచ్ పదవులే గాని, వార్డు సభ్యుల పదవులే గాని ఎన్నిక చేయరాదని సూచించారు. ఏకగ్రీవల పేరుతో ఇతరులను నామినేషన్ వేయకుండా భయపెట్టరాదన్నారు. నామినేషన్లను వేసిన వారిని భయపెట్టి ఉపసంహరించి ఏకగ్రీవ ఎన్నిక అయినట్లు చేసినచో అది చట్టరీత్యా నేరమని తెలిపారు. ఈ విధంగా ఎక్కడైనా ఏకగ్రీవ ఎన్నిక జరిగితే అట్టి ఎన్నికను జిల్లా కలెక్టర్, ఎన్ఓసి జారీ చేసిన తర్వాతనే అట్టి ఎన్నికలు జరుగుతుందన్నారు. ఎన్ఓసి జారీ చేయకపోతే అట్టి ఎన్నికను గుర్తించబడదని, ఎలాంటి పాలకవర్గం ఆ గ్రామానికి ఉండనందున మళ్లీ ఆ గ్రామంలో ఆరు నెలల లోపల ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుందని అవగాహన కల్పించారు. 

పోలింగ్ కేంద్రాల పరిశీలన…..
మండలంలోని కేసీ తాండ, కోనాపూర్, డిసి తండా, వినాయక నగర్, నర్సాపూర్, కోన సమందర్, బషీరాబాద్, హాస కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పోలింగ్ స్టేషను అధికారులు మంగళవారం పరిశీలించారు.ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, తహసిల్దార్ గుడిమేల ప్రసాద్, ఏఎస్ఐ మండల పంచాయతీ అధికారి సదాశివ్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.నామినేషన్ స్వీకరణ క్లస్టర్  కేంద్రాలలోని గ్రామ పంచాయతీలను నామినేషన్ సన్నాహక చర్యల గురించి రిటర్నింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -